HNK: నడికూడ మండలాల్లో రేపు నిర్వహించబోయే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయనున్న గ్రామసభలను విజయవంతం చేయాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. గ్రామ సభలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని, గ్రామ సమస్యల పరిష్కారం కోసం యువత, ప్రజా ప్రతినిధులు, ప్రజలు గ్రామసభల్లో భాగస్వాములు కావాలని ఎంపీడీవో సూచనలు చేశారు.