SRCL: వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజల కోసం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఈ చలివేంద్రాన్ని సహాయక మోటర్ వాహనముల తనిఖీ అధికారి పృథ్విరాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కల్పన, జూనియర్ అసిస్టెంట్ శ్రావణి, ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.