ASR: జిల్లా పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. బుధవారం పాడేరు ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా, రూ.7లక్షల విలువైన 65మొబైల్ ఫోన్లను బాధితులకు స్వయంగా అందజేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం, ఇతర ప్రాంతాల నుంచి మొబైల్ రికవరీ చేసిందన్నారు.