JGL: ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలోని MPUPS పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందేని మొగిలి, ఉప సర్పంచ్ చిలుక రామన్నతో పాటు వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా మరిన్ని పనులు చేపడతామని తెలిపారు.