WGL: ప్రజా సమస్యల పరిష్కారానికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.