కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు బుధవారం ఆలమూరు వాస్తవ్యులు వెత్సా ప్రకాషరావు అనంత లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116ల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేసినట్లు తెలిపారు. దాత కుటుంబానికి ఆయన స్వామివారి చిత్రపటం అందజేశారు.