NZB: సాలూర మండలం మంజీర పరీవాహక ప్రాంతం నుంచి ట్రాలీ ఆటోలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో బోధన్ అర్బన్ ఆర్ఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాలీ ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆర్ఐని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.