ఏలూరు: ఉంగుటూరు మండలం అప్పారావు పేట గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 కార్యక్రమం కింద నిర్మాణం పూర్తయిన ఇంటికి సంబంధించి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఇందులో గృహ నిర్మాణ శాఖ డీఈ సత్యనారాయణ, ఎంపీడీవో మనోజ్, తాహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, తదితరులు ఉన్నారు.