NDL: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్యాపిలి మండలం చండ్రపల్లిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.