అన్నమయ్య: రామాపురం మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం లేకుండా విద్య అందించాలని సూచించారు.