KMM: రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో వేసవికాలం నీటి సమస్య లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్ షేక్ సిద్ధిక్ మిషన్ భగీరథ అధికారులను కోరారు. బుధవారం మిషన్ భగీరథ అధికారులతో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమావేశమయ్యారు. గ్రామపంచాయతీలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ అధికారులకు వివరించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.