AP: అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినందుకు.. ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ‘పోరాడి విజయం సాధించిన రైతులకు అభినందనలు. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి.. ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.