NLR: చేజర్ల మండలంలో స్వచ్ఛాంధ్రా-స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని బుధవారం ప్రారంభించారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే ఈ వాహనానికి చెత్త ఇచ్చి దానికి బదులుగా ఉపయోగకరమైన వస్తువులు తీసుకోవచ్చని టీడీపీ నాయకులు తెలిపారు. పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.