BDK: అశ్వాపురం మండల కేంద్రంలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.