E.G: రాజానగరంలో ‘చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం’ అమలు కార్యక్రమంలో రూడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఉచిత విద్యుత్ పథకం’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్తుందని చెప్పారు.