ATP: గ్రామాభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సర్పంచుల సేవలు మరువలేనివని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వీడ్కోలు సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం పదవీకాలం ముగిసిన సర్పంచ్లకు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి సన్మానించారు.