ASR: అరకు మండలం కొత్తవలసలో 2.5 ఎకరాల గిరిజన భూమిని ఎకో కాటేజీల పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. పాడేరు ఐటీడీఏ జారీ చేసిన ఈ టెండర్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వాలకు లేదన్నారు.