MDK: మండలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ఎండుతున్న వరి పంటలకు మల్లన్న సాగర్ నీరు ఊపిరి పోస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కెనాల్ ద్వారా వస్తున్న నీటిని రైతులు సాగుకు ఉపయోగిస్తున్నారు. అయితే, కెనాల్ నుండి పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించే క్రమంలో, నీటి ఉధృతికి పైపులు పగిలి జలాలు వృధా అవుతున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు.. సాగునీటిని వృధా కాకుండ రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవలన్నారు.