TG: 2 లక్షల ఉద్యోగాల హామీపై జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదని జాగృతి అధ్యక్షరాలు కవిత నిలదీశారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగ నోటిఫికేషన్లకు జీవో 4.. 20 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి జీవో 108 అడ్డంకిగా ఉందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు అడ్డుగా ఉన్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.