TG: స్నేహ చికెన్స్ కంపెనీ ఔట్లెట్ల ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ ప్రతినిధులకు, రిటైలర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఔట్లెట్లను మూసివేయాలని రిటైలర్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలను రిటైలర్లు బంద్ చేసిన విషయం తెలిసిందే.