మహిళలకు చీరలు(sarees), ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే షాపింగ్ మాల్స్(Shopping malls) కు వెళ్లి తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేస్తారు. అదే వారికి నచ్చింది ఇతరులు తీసుకుంటే మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఇలాంటి ఘటనే బెంగళూరు(Bangalore)లో చోటుచేసుకుంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్లో సిల్క్ చీర వార్షిక విక్రయం నిర్వహించారు.చీరలపై 35 శాతం తగ్గింపు.. అంటూ బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ముందు బోర్డు పెట్టారు. అది చూసిన చాలామంది మహిళలు చీరల కోసం ఎగబడ్డారు.
ఇసుక వేస్తే.. రాలనంత మంది మహిళలు (womens) జమకుడారు. అందరూ ఎంతో ఉత్సాహంగా తమకు నచ్చిన చీరల కోసం వెతుకుతున్నారు.ఇంతలో ఎమైందో తెలియదు కాని అందరూ చూస్తున్నారన్న విషయం మర్చిపోయి.. ఇద్దరు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు(beating) ఓ పోలీస్, వచ్చి ఆపినా ఆగలేదు. ఎవరు వీడియో తిశారొ తెలియదు కాని దాన్ని సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మరింది.ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చీరలంటే ఇష్టం ఉండాలి కానీ.. మరీ ఇలా కొట్టుకునేంత ఉండకూడదని కామెంట్స్ పెడుతున్నారు.