సత్యసాయి: పుట్టపర్తి, కొత్తచెరువు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నైట్ విజన్ డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహించారు. సీఐ బొజ్జప్ప నేతృత్వంలో అనుమానాస్పద వ్యక్తులు, బహిరంగ మద్యపానంపై తనిఖీలు చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ నేరాలను అరికడతామని అధికారులు స్పష్టం చేశారు.