SRCL: వేములవాడలో ఆరే క్షత్రియ కులస్థుల ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన శివాజీ నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. అనంతరం మాజీ సర్పంచ్ సిలువేని మల్లేశం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.