ATP: అనంతపురం కరువు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కరువు జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకలు, తదితరులు పాల్గొన్నారు.