Chinmayi: అసలు వీడు, మనిషేనా, మైనర్‌తో అసభ్య ప్రవర్తన
బెంగళూరులో గల ఓ మాల్లో మైనర్ బాలిక పట్ల నీచుడు మిస్ బిహేవ్ చేశాడు. క్షణకాలంలో వచ్చి అమ్మాయికి డ్యాష్ ఇచ్చి, చేతు పెట్టి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను సింగర్ చిన్మయ్ షేర్ చేసి.. మండిపడింది.
Singer Chinmayi: మహిళలు పని చేసే చోట కూడా వేధింపులకు గురవుతున్నారని అప్పట్లో మీ టు ఉద్యమం జరిగింది. ఇది సినీ ఇండస్ట్రీ నుంచి మొదలు కాగా.. ఇతర రంగాల వారు కూడా బయటకు వచ్చారు. ఆ సమయంలో మీ టు గురించి బహిరంగంగా మాట్లాడారు సింగర్ చిన్మయ్ (Singer Chinmayi). అన్ని రంగాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారని గొంతెత్తారు. చిన్మయ్ ఓ సామాజిక కార్యకర్త. మహిళల సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.
లులు మాల్
‘బెంగళూరులో లూలూ మాల్లో ఓ మైనర్ ఉంది. యువతిపై ఓ నీచుడి కన్నుపడింది. ఎలాగైనా తాకాలని అనుకొని ఉంటాడు. అప్పుడు అంత రద్దీగా కూడా ఏం లేదు.. వెనకాల నుంచి డ్యాష్ ఇచ్చి, చేతు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో ఆ చిన్నారికి కూడా తెలియలేదు. అతను మాత్రం వెళ్లిపోయాడు. చూడడానికి సంఘంలో గౌరవం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. చిల్లరగా ప్రవర్తించి.. తన పరువును తాను తీసుకున్నాడు.
వీడియో షేర్ చేసిన చిన్మయ్
ఇన్ స్టాగ్రామ్‌లో ఉన్న ఆ వీడియోను సింగర్ చిన్మయ్ షేర్ చేశారు. బహిరంగ ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులా..? అని రాసుకొచ్చారు. కొందరు మగాళ్లు కావాలనే ఇలా చేస్తారు. అలా వచ్చి, వేధించి గుంపులోకి వెళ్లిపోతారని మండిపడ్డారు. ప్రజలు ఉండటంతో తప్పించుకోవడం తేలిక అవుతుంది. వీరిలో చాలామందిని ఇప్పటికీ పట్టుకోలేదు. వీరు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతారని బాధ పడ్డారు.
Source: Instagram page Colours of Bengaluru; this was shot at Lulu Mall Bengaluru.
How a man uses a public space like a mall to sexually harass women.
A LOT of these men do it intentionally.
A LOT of these men disappear into crowds never to be found and their only job in… pic.twitter.com/PKVPCrupez
అరచి గోల చేయలేదు
క్షణ కాలంలో జరగడంతో ఏం జరిగిందో అనుభవించిన వారికి తెలియదు. ఆ అమ్మాయి అరిచి గోల చేయలేదు. అలాగే చెప్పు తీసుకోని కొట్టలేదు. ఎందుకంటే మరొకరు నెట్టి వేసి ఉంటారని అనుకొని ఉంటుంది. అదేం కాదు.. కావాలనే ఇలా చేస్తారని మండిపడ్డారు. ఆ యువతి మైనర్ అని తెలిసి ఆశ్చర్య పోయాను’ అని చిన్మయ్ (Chinmayi) రాసుకొచ్చారు. నిజమే.. గుంపులో గోవిందం అన్నట్టు ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. దీంతో మరొకరు ఇలా చేసేందుకు భయపడే పరిస్థితి ఉంటుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.