Secretaries Suspended: అక్రమాలకు పాల్పడిన ముగ్గురు సెక్రటరీలపై (Secretaries) తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేయడంతో చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటన మమబూబాబాద్ (Mahabubabad) జిల్లా దంతాలపల్లి మండలంలో జరిగింది.
గున్నేపల్లిలో (Gunnepally) చనిపోయిన వ్యక్తుల పేరుతో సదరు సెక్రటరీలు పెన్షన్ (pension) డ్రా చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు విచారణ జరిపారు. గున్నేపల్లితోపాటు వాల్యాతండా, లక్ష్మీపురంలో అక్రమాలు జరిగాయని తెలిసింది. మూడు గ్రామాల సెక్రటరీలు (Secretaries) అక్షర, శ్రీకాంత్, వెంకన్నను సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ముగ్గురిని సస్పెండ్ చేశాడని ఎంపీడీవో వివరించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగగా.. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇంతలో ఓ ముగ్గురు అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారిపై చర్యలు తీసుకున్నారు.