KDP: బద్వేల్లో జన చైతన్య జీపు జాతా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న హాజరై జాతాను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి, అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యదర్శి చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.