• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు’

SRD: ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడు గుర్తుకు వచ్చాను అని ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆందోళనతో ఉన్న రైతులతో మాట్లాడే విధానం సరికాదని పేర్కొన్నారు.

March 9, 2025 / 07:54 PM IST

శరవేగంగా కల్లూరు CHC పనులు

KMM: కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న, 50 పడకల ఆసుపత్రి, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో అందుటుబాలోకి తెచ్చేందుకు, సుమారు రూ.10 కోట్లతో CHC నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భవనానికి శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి.

March 9, 2025 / 07:25 PM IST

గుండంలో మునిగి బాలుడి మృతి

MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు. 

March 9, 2025 / 05:18 PM IST

‘నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి’

NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని తోలు పరిశ్రమ, లక్కం పల్లి సేజ్‌లో నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాలు విన్నవించారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో స్థానిక యువకులకు ఆర్థిక భారం లేకుండా పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.

March 9, 2025 / 05:14 PM IST

‘హత్యకేసులో నిందితుడి అరెస్ట్’

మేడ్చల్: జవహర్ నగర్ కౌకూర్లో తల్లి కూతురును హతమార్చిన ఘటనలో నిందితుడు అరవింద్‌ను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడు అరవింద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు పారిపోయే క్రమంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఆదివారం జవహర్ నగర్ పోలీసులు పేర్కొన్నారు.

March 9, 2025 / 05:12 PM IST

నూతన పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం

KNR: జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నూతన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా నియమించబడ్డారు. బాధ్యతల స్వీకరణకు కరీంనగర్‌కు విచ్చేసిన గౌస్ ఆలం ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఉన్న అభిషేక్ మొహంతి ఐపీఎస్‌ను పూల మొక్కను అందించారు

March 9, 2025 / 05:06 PM IST

SLBC వద్ద భయం.. భయం.!

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి.

March 9, 2025 / 02:24 PM IST

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL:మల్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్వహించిన రాజగోపురం ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు.

March 9, 2025 / 02:13 PM IST

మంత్రి తుమ్మల కృషి అమోఘం: రైతులు

KMM: సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను సాగర్ కెనాల్ ద్వారా వేంసూరు మండలంలోని పంట పొలాలకు అందించడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కురిసి అమోఘమైనదని రైతులు అన్నారు. ఆదివారం గోదావరి జలాలు పంట పొలాలకు చేరిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల, పొంగులేటి, భట్టి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం నిర్వహించి, కృతజ్ఞతలు తెలిపారు.

March 9, 2025 / 01:59 PM IST

ప్రజాపాలన ప్రభుత్వంలో అక్రమ ఇసుక జోరుగా..

BDK: జిల్లాలో కలెక్టర్ జితేష్ పటేల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలు పాటించలేని కొంతమంది మండల స్థాయి అధికారులు గుత్తేదారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు గోదావరి అనే తేడా లేకుండానే అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.

March 9, 2025 / 01:04 PM IST

ఇదేనా స్వచ్ఛ కంటోన్మెంట్ అంటే…?

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాలా 2 ఏళ్లుగా ఇలా చెత్తతో నిండిపోయింది. తొలగించాల్సిన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. చెత్త ఏరుకునే వాళ్లు వచ్చి ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్తుండటంతో కాస్త ఖాళీ అవుతోందని చెబుతున్నారు. చెత్త తొలగించకపోవడమే స్వచ్ఛ కంటోన్మెంట్ విధానమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

March 9, 2025 / 01:04 PM IST

మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో BRS పార్టీ నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నిన్న పత్రిక సమావేశం నిర్వహించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును విమర్శిచడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మీలో మీకు సమన్వయము లేకుండా, ప్రతిపక్షలను విమర్శిచడం వారి దిగజారుడు తనానికి నిదర్శమన్నారు.

March 9, 2025 / 12:59 PM IST

‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

JN: తమ్మడపల్లి (జి)గ్రామంలో స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నూకల ఐలయ్య ఆధ్వర్యంలో.. సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

March 9, 2025 / 12:29 PM IST

నాంపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

NLG: నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కంటి చూపు పరిరక్షించుకునే వారి పరిస్థితిని, వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

March 9, 2025 / 11:13 AM IST

ఇళ్ల మధ్య మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు.!

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ బసవేశ్వర కాలనీలో ఇళ్ళ మధ్యలో మురుగు నీరు నిలవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటి కారణంగా, దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి, మురుగు నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

March 9, 2025 / 10:44 AM IST