• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 30న డిండిలో తైబజార్ వేలం పాట

NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రానికి సంబంధించి తైబజార్ వేలంపాటను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి జంగయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రూ.5,500 డిపాజిట్ ముందుగానే చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

March 27, 2026 / 01:01 PM IST

కనువిందుగా స్వామివారి రథయాత్ర

NLG: శ్రీరామనవమి సందర్భంగా మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారి రథయాత్రను ప్రారంభించగా కనువిందుగా సాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, స్థానిక నేతలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

March 27, 2026 / 12:57 PM IST

డ్రైనేజ్ క్లీనింగ్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

BDK: సత్తుపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను కాంగ్రెస్ నాయకులు MD. కమల్ పాషా శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు వెంకటనారాయణ రెడ్డి, రాయల కోటేశ్వరరావు పాల్గొని పనుల తీరును పర్యవేక్షించారు. వార్డులోని ప్రధాన వీధుల్లో మురుగునీరు నిలిచిపోకుండా, త్వరితగతిన తొలగించాలని ఆదేశించారు.

March 27, 2026 / 12:54 PM IST

ఎస్సారెస్సీ కాల్వ గండిని పూడ్చివేయించిన సర్పంచ్

PDPL: అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్‌లో ఎస్సారెస్పీ కాల్వకు పడిన గండిని సర్పంచ్ ఆంగోత్ రవి కుమార్ నాయక్ పూడ్చివేయించారు. కాల్వ నీరు ఇళ్లలోకి చేరుతుండటం, రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతుండటంతో ఆయన అధికారులతో మాట్లాడి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. కాంక్రీట్‌తో గండిని పూడ్చి నీటి వృధాను అరికట్టారు. సర్పంచును గ్రామస్థులు అభినందించారు.

March 27, 2026 / 12:49 PM IST

సీతారామ కల్యాణోత్సవంలో పాల్గొన్న TPCC అధ్యక్షుడు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో శుక్రవారం శ్రీ రామనవమి పర్వదినోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతారామ కల్యాణోత్సవంలో TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాములు నేటి తరం యువతకు బంధాల పట్ల ఉండాల్సిన నిబద్ధతకు, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలని పేర్కొన్నారు.

March 27, 2026 / 12:46 PM IST

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని పాండ చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకిస్తున్నారు.

March 27, 2026 / 12:44 PM IST

గ్యాస్ సిలిండర్లకు, పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్

WNP: జిల్లాల్లో గృహావసరాలకు LPG సిలిండర్లకు గాని పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదనీ ప్రజలు వదంతులు నమ్మి ప్రస్తుత అవసరం లేకున్న ముందస్తు కొనుగోలుకు ప్రయత్నం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటనలో తెలిపారు. సిలిండర్ల సరఫరా పెంచడం జరిగిందన్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, గ్యాస్ సిలిండర్లు,పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి లోటు లేదన్నారు.

March 27, 2026 / 12:43 PM IST

“డ్రగ్స్ రహిత జిల్లాగా BHPLని తీర్చిదిద్దడమే లక్ష్యం”

BHPL: జిల్లాలో డ్రగ్స్ సేవించి వాహనాలు నడిపే వారిని సులభంగా గుర్తించి చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూపొందించిన ‘యూరిన్ కప్ టెస్ట్’ ద్వారా గంజాయి, కొకైన్‌తో సహా 11 రకాల మత్తు పదార్థాలను ఒక్కసారిగా గుర్తించవచ్చు. డ్రగ్స్ రహిత జిల్లాగా BHPLని తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.

March 27, 2026 / 12:42 PM IST

మణుగూరులో భారీ ర్యాలీ నిర్వహించిన ఏఐటీయూసీ

BDK: సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా మణుగూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. సింగరేణి సంస్థను రక్షించాలని, కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

March 27, 2026 / 12:38 PM IST

మహాశక్తి ఆలయంలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించగా, సీతారామచంద్రస్వామి విగ్రహాలను వధూవరులుగా ముస్తాబు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్-అపర్ణ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 27, 2026 / 12:34 PM IST

పంటల సర్వేను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా

GDWL: ఇటిక్యాలలో జరుగుతున్న పంటల సర్వేను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యాప్ వినియోగాన్ని తనిఖీ చేస్తూ, రైతులను సంప్రదించి సాగు వివరాలు, ఖాళీ భూముల (Waste land) డేటాను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా సేకరణలో పారదర్శకత పాటించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

March 27, 2026 / 12:33 PM IST

విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం.. డ్రైవర్‌కు గాయాలు

KMM: ముదిగొండ మండలం గందసిరి-వల్లాపురం రహదారి సమీపంలో శుక్రవారం మొక్కజొన్న కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 27, 2026 / 12:32 PM IST

వెంటనే వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నాగరాజు

MLG: మంగపేట మండల కేంద్రంలో ఇవాళ మన్య సీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు నాగరాజ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రతినిధులు ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ సంఘంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వివాదంపై చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 27, 2026 / 12:27 PM IST

పట్టు వస్త్రాలు సమర్పించిన MLA దంపతులు

SRD: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవంలో పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

March 27, 2026 / 12:26 PM IST

పట్టు వస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే..

HNK: హన్మకొండ మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కార్యాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినం మన భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

March 27, 2026 / 12:26 PM IST