• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మండలంలో రోడ్డుపై మట్టి రాళ్ల తొలగింపు

VKB: బంట్వారం మండల కేంద్రంలో అండర్ డ్రైనేజ్ పైప్‌లైన్ పనుల కోసం తవ్విన మట్టి, రాళ్లు కొంతకాలంగా రోడ్డుపై పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యను గమనించిన మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, స్వయంగా ముందుండి మట్టి, రాళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో రహదారి సాఫీగా మారి వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

March 27, 2026 / 12:12 PM IST

తమ్మడపల్లెలో శ్రీరామనవమి వేడుకలు

JN: జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లెలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భక్తులు ఆకాంక్షించారు.

March 27, 2026 / 12:11 PM IST

21.5 అడుగులకు చేరిన పాలేరు జలాశయం

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 21.5 అడుగులకు చేరింది. సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలకు నీరు పుష్కలంగా ఉండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 12:08 PM IST

భారీ ట్రక్కు తృటిలో తప్పిన ప్రమాదం

MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై వెళ్తున్న భారీ వాహనానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రేండ్లగూడ ప్రధాన రహదారిపై వెళ్తున్న భారీ ట్రక్కుకు అక్కడి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని అక్కడే నిలిపివేశారు. స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి భారీ టక్కుకు ప్రమాదం కాకుండా చూశారు.

March 27, 2026 / 12:07 PM IST

జాలర్లకు చిక్కిన అరుదైన వింత చేప

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం బయానా గుట్ట సమీప వాగులో జాలర్లకు వలలో వింత చేప చిక్కింది. ఇది సాధారణ చేపల కంటే భిన్నంగా ఉండటంతో ఇది ఏ జాతికి చెందినదో గుర్తించలేకపోతున్నారు. అరుదైన ఈ చేపను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అరుదైన జాతి చేపగా భావిస్తున్నారు. ఇలాంటి చేప కనిపించడం ఇదే మొదటిసారని తెలిపారు.

March 27, 2026 / 12:06 PM IST

మహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

PDPL: మంథని పట్టణంలోని రావులచెరువు కట్ట మహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 82,653 వచ్చినట్లు ఆలయ ఈవో రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఈవో రాజకుమార్, ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆరు నెలలకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రశాంత్, మహిళా భక్తులు పాల్గొన్నారు.

March 27, 2026 / 12:05 PM IST

సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సీతారాములవారి కళ్యాణోత్సవంలో ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు.

March 27, 2026 / 12:05 PM IST

రాములోరి కళ్యాణం వద్ద బూట్లతో బౌన్సర్లు

WGL: కాశిబుగ్గ సీతారామాంజనేయ ఆలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న ప్రాంగణంలో బౌన్సర్లు బూట్లు ధరించి ఉండడం భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. మంత్రి సురేఖ ఏర్పాటు చేసిన కొత్త కమిటీని కోర్టు రద్దుచేసిన నేపథ్యంలో.. కొత్త కమిటీ సభ్యులు బౌన్సర్లను నియమించుకున్నారు. వారు బూట్లతో రావడంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 12:04 PM IST

కోడితో ఎంబీఏ విద్యార్థిని షికారు.!

HYD: రహమత్ నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని సంతోషిణి తన పెంపుడు కోడిపై వినూత్నంగా ప్రేమను చాటుకున్నారు. ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక.. రంధ్రాలున్న బ్యాగులో కోడిని ఉంచి తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లారు. రెండు కోడిపిల్లలను తెచ్చుకోగా.. ప్రస్తుతం ప్రాణంతో ఉన్న ఈ ఒక్క కోడిని తను ఎంతో అపురూపంగా పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.

March 27, 2026 / 12:02 PM IST

తోమాలపల్లిలో శ్రీరామనవమి వేడుకలు

WNP: తోమాలపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ దేవాలయాన్ని పూలతో అందంగా అలంకరించి రాములవారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. భక్తుల సౌకర్యార్థం ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆనంద్, భరత్, వేణు, రాముడు యాదవ్, మధు, శేషి రెడ్డి పాల్గొన్నారు.

March 27, 2026 / 12:01 PM IST

మహిళ సంఘ భవనానికి భూమి పూజ

NZB: ముప్కాల్ మండలం నల్లూరులో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ బర్కం గంగాధర్ శుక్రవారం భూమిపూజ చేశారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో NREGS నిధులు రూ. 10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిధులతో భవనాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 27, 2026 / 11:57 AM IST

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

BDK: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను సమీక్షించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 27, 2026 / 11:53 AM IST

వైన్స్ బంద్.. మీ అభిప్రాయం ఏంటి?

HYD: ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్, బార్లను అధికారులు మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? 1. మంచి నిర్ణయం2. వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేశారు

March 27, 2026 / 11:53 AM IST

మాజీ మావోయిస్టు కుటుంబానికి ప్రభుత్వ భరోసా

ASF: మాజీ మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఎస్పీ నితికా పంత్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మత్‌తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. మాజీ మావోయిస్టు నగేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, భూమి పట్టా మంజూరు చేయాలని, వారి కుమార్తె ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 27, 2026 / 11:50 AM IST

గురువు రమణయ్యకి కేసీఆర్ సంతాపం

SDPT: ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య (85) కన్నుమూశారు. సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ బోధించిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ తన క్లాసులను ఎప్పుడూ మిస్ కాలేదని రమణయ్య ఒక సందర్భంలో గుర్తుచేశారు. ఒకసారి కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు “ఫాదర్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం” అంటూ అభివర్ణించడం విశేషం.

March 27, 2026 / 11:47 AM IST