PDPL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ధర్మారంలోని రామాలయంలో ఇవాళ భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, టెంకాయలు సమర్పించారు. ఆలయ పురోహితులు భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మరియు పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నాన్ AC గదులు, హాల్స్&సూట్ రూమ్స్ నిర్వహణ కోసం శనివారం ఈ-టెండర్లు & బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు EO మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు రూ.5 లక్షల ధరవాత్తు సొమ్ము చెల్లించి టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
MLG: ఏటూరునాగారం రామాలయ సమీపంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఏటూరునాగారం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా అధ్యక్షుడు ఆకాంక్షించారు.
BDK: భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలను పటిష్ఠం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని శుక్రవారం 108 అంబులెన్స్‌ను పరిశీలించారు. అంబులెన్స్‌లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయం, ప్రథమ చికిత్స సామగ్రి వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు.
HNK: జిల్లా కోర్టు రెండు కీలక కేసుల్లో కఠిన తీర్పులు వెలువరించింది. పర్వతగిరి (M)లో దోపిడీకి పాల్పడిన ఐదుగురు నేరస్తులకు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన జోసెఫ్ తంబికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తులు ఈ తీర్పులు ఇచ్చారు. బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
RR: చేవెళ్ల పట్టణంలోని సీతారాముల కళ్యాణ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ రాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ 6వ వార్డులో ఆశ్రయ స్వచ్చంద సంస్థ, తెలంగాణ లేబర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో 51 మందికి లేబర్ కార్డులు జారీ చేశారు. జిల్లా కో-ఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు కార్డులు పొందితే ప్రమాదాల సమయంలో ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.
NZB : ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరాముని జీవితం ధర్మం, న్యాయం, సత్య మార్గంలో ఎలా నడవాలో నేర్పుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
SRD: పటాన్‌చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ మాధారం గ్రామంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి 42 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
NLG: చింతపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో వర్కాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 73 పరిధిలో భూములు కోల్పోయిన 15 మంది రైతులకు నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీవో రమణారెడ్డితో కలిసి మొత్తం రూ. 3కోట్ల 4లక్షల 50 వేల విలువ గల చెక్కులను అందజేశారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోందని తెలిపారు.
ADB: మాజీ మంత్రి సీ. రామచంద్రారెడ్డి (సీఆర్ఆర్) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గండ్రత్ సుజాత, గోవర్దన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. రిమ్స్ ఏర్పాటు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఆర్ఆర్ కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సారథ్యంలో ‘పోలీస్ అక్క’ బృందం రికార్డు స్థాయి ఫలితాలు సాధించింది. కేవలం నెల రోజుల్లో 60 గ్రామాలు, 45 పాఠశాలల్లో 131 అవగాహన సదస్సులు నిర్వహించి, 17 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. మహిళల భద్రత కోసం 25 ఫిర్యాదులను పరిష్కరించారు. అత్యవసర సహాయం కోసం 100 లేదా 8712659953 నంబర్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన పద్మ పేదరికాన్ని గమనించిన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆమె నివాసానికి వెళ్లి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ చేతుల మీదుగా రూ. 11,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంపెల్లి రమేష్, హరిబాబు, విజయ్, యాదయ్య పాల్గొన్నారు.
SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
RR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామంలోని, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం రాముడు చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయం అని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.