మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న యువ ఉత్సవ్ పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి రంజిత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సైన్స్ మేళా ప్రదర్శన, రచన పోటీలు, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ఉపన్యాసం, యంగ్ ఆర్టిస్ట్ పోటీలు ఉంటాయన్నారు. 15-29 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.