కడప: తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆర్టీసీ డిపోకు చెందిన నేషనల్ మజ్దాూర్ యూనియన్ నాయకులు మైదుకూరు తహశీల్దారు రాజసింహ నరేంద్రకు వినతి పత్రం అందించారు. అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్స్ను ఎత్తివేయాలన్నారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని అమలు చేయాలన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు ఓడీలను వేయాలనే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలన్నారు.