SRPT: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ అన్నారు. సోమవారం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో గ్రామంలో సైబర్ నేరాలు, గంజాయిపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని అన్నారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు.