ప్రకాశం: ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య హత్య కేసు విచారణలో తీసుకొచ్చిన ఓ అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేయగా ఆస్పత్రిలో చనిపోయాడు. ఈ కేసులో కీలక నిందితుడు వినోద్ స్నేహితుడి అశోక్ కాల్ లిస్టులో మైరాల సూర్య నంబర్ ఉండటంతో అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తరువాత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు.