SRPT: వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలతో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉందని దృష్టికి వస్తే వెంటనే స్పందించి ఆసమస్యను పరిష్కరించాలని తెలిపారు.