KMR: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిని గ్రామంలో మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి అమానుషమని సోమవారం MRPS కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు భూమయ్య మాదిగ అన్నారు. గుడిలోకి ప్రవేశించడని అజయ్ కుమార్ను కాళ్లు చేతులు కట్టి నగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం దారుణమని తీవ్రంగా ఖండించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.