SKLM: ముఖ్యమైన కేసుల దర్యాప్తునకు నేర పరిశోధనలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలే కీలకమని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేర స్థలం పరిశోధనలో అనుసరించవలసిన విధి విధానాలు తూచా తప్పకుండా పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.