ADB: జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు.