AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.