HYD: వర్షపు నీరు సాఫీగా చెరువులోకి వెళ్లేలా గుర్రం చెరువుని శుభ్రం చేయాలని చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వహాద్ ఆదేశించారు. సోమవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ గుర్రం చెరువును పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని క్లియర్ చేయాలన్నారు. వర్షాకాలంలో స్థానికుల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.