SRD: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని CITU రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని శాండ్విచ్ ఎంప్లాయిస్ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు.