NLG: సీఎం సహాయనిధి పథకం పేదలకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుధుడు అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన పాకాల బచ్చయ్యకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కును సోమవారం వారు కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గ్రామ నేతలు పాల్గొన్నారు.