W.G: జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,79,204 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 37,124 మంది విద్యార్ధుల తల్లిదండ్రులను కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు.