GNTR: కొల్లిపర మండలం తూములూరు పాల కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఇసుక లారీ అదుపుతప్పి ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీకొని, పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టింది. బస్సులోని పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని స్టేషన్కు తరలించారు.