SKLM: ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ మందస మండలంలో నీరుగారు తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం గ్రీవెన్స్‌కు తహశీల్దార్ మిస్కా శ్రీకాంత్, ఎంపీడీవో వై.వెంకటరమణ, వ్యవసాయ అధికారి నాగరాజు మాత్రమే హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడం పబ్లిక్ గ్రీవెన్స్ వెలవెలబోయింది.