NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 68 మంది అర్జీ దారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా కృషి చేయాలి సూచించారు. మధ్యవర్తులు అవసరం లేదనీ బాధితులు ప్రత్యక్షంగా రావాలనీ తెలిపారు.