MDK: శివంపేట మండలంలో రోడ్డుపై గుంతలను యువకులు సోమవారం పూడ్చివేశారు. శివంపేట నుంచి చాకిరిమెట్ల వరకు తూప్రాన్ – నర్సాపూర్ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గూడూరు గ్రామానికి చెందిన యువకులు కంకర సిమెంట్ డస్ట్ సేకరించి గుంతలను పూడ్చివేశారు. ప్రజలు ప్రమాదాల బారిన పడుతుండడంతో గుంతలను పూడ్చినట్లు యువకులు తెలిపారు.