GNTR: గుంటూరులోని నల్లచెరువు రోడ్డులో అవుట్‌ఫాల్ డ్రైన్ పూడికతీత పనులు చేపట్టనున్నందున మంగళవారానికల్లా డ్రైన్‌పై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజలను ఆదేశించారు. లేనిపక్షంలో పట్టణ ప్రణాళిక సిబ్బంది తొలగిస్తారని హెచ్చరించారు. వర్షాల వల్ల మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని ఆయన పేర్కొన్నారు.