BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మహిళా శక్తి సంబరాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.